27, జూన్ 2009, శనివారం

granthalaya sarvasvam

 
గ్రంథాలయ సర్వస్వము

గ్రంథాలయ సర్వస్వము ఒక తెలుగు పత్రిక. 20వ శతాబ్ది రెండవ దశకంలో త్రైమాసికగా ప్రారంభమై ఇప్పటికీ మాస పత్రికగా ప్రచురితమౌతున్నది. మధ్యలో కొంతకాలం ఆగిపోయి, తిరిగి గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య పూనికతో 1948 జనవరి నుండి ప్రారంభమై నిర్విఘ్నంగా నడుస్తుంది. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, సురవరం ప్రతాపరెడ్డి, పోతూరి నాగభూషణం సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం పోతూరి నాగభూషణం గారి కుమార్తె రావి శారద గ్రంథాలయ సర్వస్వం పత్రికకు ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్ గా ప్రచురణ కొనసాగిస్తున్నారు.


పత్రికను ప్రచురిస్తున్న ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం 1939లో విజయవాడలో సొంత భవనాన్ని ఏర్పరచుకొని దానికి "సర్వోత్తమ భవనం" అని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు పేరును పెట్టారు. రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఈ పత్రిక ప్రతులు చాలావరకు ఇప్పుడు సర్వోత్తమ భవనంలో భద్రంగా ఉన్నాయి.


1956-57 సంవత్సరంలో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం విశాలాంధ్ర అవతరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అయింది. భాషా పరిణామ క్రమంలో భాగంగా గ్రంథాలయ సర్వస్వము చివరి అక్షరాన్ని పూర్ణానుస్వారంగా మార్చుకొని గ్రంథాలయ సర్వస్వం అయింది.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి